కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల్లో సమస్యలు..! అక్కడకు క్యూ, మీరు కూడా ఉన్నారా?
Sat May 31, 2025 06:51 Politics
ఏపీలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మే నెల ప్రారంభం నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తోంది. కొత్త రేషన్ కార్డుల జారీతో పాటుగా రేషన్ కార్డుల విభజన, మార్పులు, చేర్పులకు అవకాశం కల్పిస్తున్నారు. దీంతో కొత్త రేషన్ కార్డుల కోసం.. గ్రామ, వార్డు సచివాలయాలకు జనం క్యూ కడుతున్నారు. అలాగే వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర ద్వారా కూడా ప్రభుత్వం రేషన్ కార్డు సేవలను అందిస్తోంది. అయితే కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేవారిని సాంకేతిక సమస్యలు వేధిస్తున్నాయి. కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియలో అక్కడక్కడా ఎదురవుతున్న సాంకేతిక, పాలనాపరమైన సమస్యలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఆధార్ సీడింగ్, విద్యుత్ వినియోగం మ్యాపింగ్ కారణంగా కొన్నిచోట్ల అర్హులైనవారు కూడా కొత్త రేషన్ కార్డులు పొందలేని పరిస్థితి ఉందనే విమర్శలు వస్తున్నాయి.
ఎన్టీఆర్ భరోసా వృద్ధాప్య పింఛన్లు, దివ్యాంగుల పింఛన్లు, ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం, తల్లికి వందనం వంటి సంక్షేమ పథకాలకు రేషన్ కార్డులను కూడా ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. అయితే రేషన్ కార్డుల జారీ కోసం ఆధార్ లింకేజి, కరెంట్ వినియోగం, వాహనాలు ఏమైనా ఉన్నాయా అనే సమాచారాన్ని సేకరిస్తారు. ఈ క్రమంలోనే కొంతమంది అర్హులైన వారికి కూడా రేషన్ కార్డులు అందని పరిస్థితి నెలకొంది. మరీ ముఖ్యంగా విద్యుత్ వినియోగానికి ఆధార్ అనుసంధానం సమస్య ప్రధానంగా మారింది. నెలకు 300 యూనిట్లకు పైగా విద్యుత్ వాడే కుటుంబాలకు రేషన్ కార్డులకు అనర్హులుగా పేర్కొంటున్నారు. ఏడాదికి మొత్తం అయ్యే కరెంట్ వినియోగాన్ని ప్రామాణికంగా తీసుకుని.. ఆ కుటుంబాలను రేషన్ కార్డులకు అనర్హులుగా పేర్కొంటున్నారు.
అయితే కొన్నిచోట్ల ఆధార్ కార్డు నంబర్లు విద్యుత్ కనెక్షన్లకు తప్పుగా అనుసంధానం అవడం సమస్యగా మారింది. అధికంగా విద్యుత్ వినియోగించే కనెక్షన్లకు తప్పుగా వేరొకరి ఆధార్ అనుసంధానం కావటంతో.. అలాంటి వారికి రేషన్ కార్డులు రాని పరిస్థితి. తాము చిన్నింట్లో ఉంటున్నామని..
ఇది కూడా చదవండి: రేషన్ కార్డు దారులకు అలర్ట్! రేషన్ కొత్త టైమింగ్స్, తేదీలు ఇవే..!
అయితే తమ ఆధార్ కార్డు వేరొక కరెంట్ కనెక్షన్‌తో లింక్ కావటం.. ఆ కనెక్షన్ మీద ఎక్కువ విద్యుత్ వినియోగం జరుగుతూ ఉండటంతో తమను రేషన్ కార్డుకు అనర్హులుగా చెప్తున్నారని కొన్నిచోట్ల ప్రజలు ఆరోపిస్తున్నారు. దీంతో దీనిని సరిచేయాలని విద్యుత్ అధికారులను ఆశ్రయిస్తు్న్నారు.
మరోవైపు ఆధార్ కార్డులో కుటుంబం వివరాలు తప్పుగా నమోదు కావటం కూడా కొంతమందికి సమస్యగా మారింది. వివాహమైన యువతి ఆధార్ కార్డు మీద ఆమె తల్లిదండ్రుల అడ్రస్ ఉండటం కూడా దరఖాస్తు వెరిఫికేషన్‌లో రిజెక్ట్ చేయడానికి కారణమవుతోంది. దీనిని ఆధార్ కార్డులో అడ్రస్ వివరాలను సరిచేసుకోవాలంటే కొన్నిచోట్ల మ్యారేజ్ సర్టిఫికేట్ అడుగుతున్నారని కొంతమంది వాపోతున్నారు. దీంతో కొత్త రేషన్ కార్డులు అవసరమైన వారు ఆధార్ సేవా కేంద్రాలు, కరెంట్ ఆఫీసుల వద్ద క్యూ కడుతున్న పరిస్థితి.
మరోవైపు కొత్త రేషన్ కార్డుల జారీ.. నిరంతరం జరిగే ప్రక్రియగా ప్రభుత్వం చెప్తోంది. ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని.. కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు కోసం ముగింపు గడువు అంటూ ఏమీ లేదని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్తు్ననారు. ఆధార్, విద్యుత్ వినియోగ మ్యాపింగ్ విషయాల్లో తప్పులను సరిచేసుకుని.. మరోసారి కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఆలస్యంగా ఓటీటీ ట్రాక్ పైకి.. ఫారిన్ కష్టాలు పడితేనే గాని తెలియదు..!
ఏపీ మద్యం కేసులో నలుగురు నిందితులకు కస్టడీ! న్యాయవాది సమక్షంలో..
బెయిల్.. అయినా తప్పదు జైలు అన్నట్టుగా వల్లభనేని వంశీ పరిస్థితి! కీలక ఆదేశాలు జారీ.!
చిక్కుల్లో కమల్ హాసన్.. బెంగళూరులో కేసు నమోదు! ఆయన వ్యాఖ్యలపై కన్నడిగుల ఆగ్రహం..
ఈ సంప్రదాయం కళాకారులకు గొప్ప.. సీఎంకి కృతజ్ఞతలు తెలిపిన చిరంజీవి!
కన్నీటి గాధ! ఉద్యోగాల కోసం వెళ్లి మయన్మార్ లో చిక్కుకున్న భారతీయులకు చిత్రహింసలు!
ఉద్యోగులకు గుడ్ న్యూస్! భారీగా పెరగనున్న జీతాలు! ఎంతంటే?
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#andhrapravasi #RationCardIssues #PublicRush #RationCardQueue #GovernmentServices #APNews #PublicProblems
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.